calender_icon.png 10 November, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను నిలిపివేయాలి..

09-11-2025 11:05:58 PM

తెలంగాణ పబ్లికన్ పార్టీ అధ్యక్షుడు నక్క యాదీశ్వర్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): పెద్ద పార్టీలకు ఒక న్యాయం, చిన్న పార్టీలకు ఒక న్యాయంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని తెలంగాణ పబ్లికన్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నక్క యాదీశ్వర్ ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీకి కేటాయించిన మైక్ గుర్తును స్పాండ్ తో ఈవీఎం బ్యారెట్ బాక్సులో స్పష్టంగా కనబడేలా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి స్టాండ్ తో ఉన్న మైక్ గుర్తును కేటాయించిందిని అన్నారు. అయితే రాష్ట్ర అధికారులు మాత్రం అస్పష్టంగా తమ గుర్తు కనిపించేలా చేశారని, దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఈ విషయంపై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గుర్తులు మాత్రం స్పష్టంగా ముద్రించారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు ఈవీఎం బ్యాలెట్ పై మైక్ గుర్తును స్టాండ్ తో సహా స్పష్టంగా ముద్రించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే తమ పార్టీ నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నోజు శ్రీనివాస్, యోగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.