01-09-2025 01:54:33 AM
లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు జప్తు చేసుకున్న ఈడీ
భువనేశ్వర్, ఆగస్టు 31: ఒడిశాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శక్తి రంజన్ డాష్‌కు చెందిన పలు లగ్జరీ కా ర్లు, బంగారు ఆభరణాలను కేంద్ర ద ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్‌లలో ఒకటైన కేసులో వ్యాపారవేత్త ఆరోపణలు ఎదుర్కొం టున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగం గానే ఈడీ ఆస్తులను జప్తు చేసింది. 10 లగ్జరీ కార్లు, రూ. 7 కోట్ల పైచిలుకు వి లువ చేసే మూడు సూపర్ బైకులు మొదలయినవి ఈడీ జప్తు చేసింది.
పో ర్షే, బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, మిని కూ పర్ కంపెనీలకు చెందిన కార్లు ఉన్నా యి. రూ. 1.12 కోట్ల విలువ చేసే బంగా రు నగలు, రూ. 13 లక్షల ధనాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అంతే కాకుండా ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలు, లాకర్లను ఫ్రీజ్ చేసింది.
శక్తి రంజన్ ఆఫీసులు, కంపెనీల్లో కేంద్ర ద ర్యాప్తు సంస్థ సోదాలు చేసింది. అన్ మోల్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎం పీఎల్), అన్‌మోల్ రిసోర్సెస్ ప్రైవేట్ లి మిటెడ్ (ఏఆర్‌పీఎల్) సంస్థలు డాష్ ని ర్వహిస్తున్నారు. రూ.౧,౩౯౬ కోట్ల బ్యాం క్ ఫ్రాడ్ కేసులో నిందితుడిగా ఉన్నారు.