03-09-2025 07:25:20 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు.అనంతరం సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఈవినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని, జిల్లా పరిదిలో ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.
ముఖ్యంగా జిల్లా పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల నిర్వాహకులు, యువత జాగ్రత్తలు తీసుకోవడం కనిపించిందని, ఇదేరీతిలో నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు ఎస్పీ తెలిపారు.
అనంతరం పోలీస్ పోలీస్ కార్యాలయంలో గత ఏడూ రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్రను ఎస్పీ ప్రారంబించగా గణపతి దేవుని ప్రతిమను డప్పు వాయిద్యాలతో, పోలీస్ అధికారులు సిబ్బంది, పిల్లలు, మహిళల కోలాటం ఆట పాటలతో అందరు ఆనందోత్సవ నృత్యాలతో కోలాహలం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి మానేరు నదిలో నిమజ్జనం చేశారు.