calender_icon.png 3 September, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా వైద్యాధికారి ధన్ రాజు

03-09-2025 07:13:13 PM

దౌల్తాబాద్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధన్ రాజు అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ల్యాబ్ పరీక్షలు, ఓపి రిజిస్టర్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం కొత్తపల్లి లో డెంగ్యూతో లక్షణాలు ఉన్నాయని తెలువడంతో గ్రామాన్ని సందర్శించి గ్రామంలో పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని, ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు భారీగా కురిసిన సందర్భంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో తిరుగుతూ వివరాలు సేకరించాలని ఆయన సూచించారు. ఏఎన్ఏం, ఆశా కార్యకర్తలకు డ్రైడే, ఫీవర్ సర్వే గురించి పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల వలన గ్రామాల్లో వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది అన్ని గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు వ్యాధులు రాకముందే జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. గ్రామాల్లో ప్రతిరోజు డ్రై డే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.