calender_icon.png 3 September, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకోవాలి

03-09-2025 07:16:56 PM

జుక్కల్,(విజయక్రాంతి): సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ సోయం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెలగం వెంకట్రావు వేసిన పిటిషన్ను వాపసు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జుక్కల్ మండల అధ్యక్షులు జాదవ్ రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం జుక్కల్ మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. బంజారా, గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

గిరిజనులు, బంజారాలు 1976 కంటే ముందు 20 సంవత్సరాలు చాలా నష్టపోయామని అన్నారు. స్వయం బాబురావు, వెంకట్రావు లు సుప్రీంకోర్టులో వేసిన కేసు వెంటనే ఉపసంహరించాలని అన్నారు. గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఆలోచన రావడం వారి పరాకాష్టానికి వదిలేస్తున్నామన్నారు. ఉన్నతంగా, ఆర్థికంగా ఎదిగిన తర్వాత గిరిజనులు, బంజారాలను జాబితా నుంచి తొలగించాలనడం సరికాదని ఎద్దేవా చేశారు. పిటిషన్ ను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.