03-09-2025 06:55:03 PM
నిర్మల్,(విజయక్రాంతి): టీజీ ఎంపీటీసీఎల్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వాట్సాప్ చాట్ సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సలియానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లాలో విద్యుత్ పరమైన సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ సిబ్బంది పనితీరుపై ఇతర ఏ సేవలు కావాలన్నా 7901628348 ఫోన్ నెంబర్ వాట్సాప్ కు పేరు సమస్య ఊరు తదితర వివరాలు పంపితే ఆ సమస్య పరిష్కారానికి విద్యుత్ సిబ్బంది సత్కారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి తోడు 19 12 టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉందని వివరించారు