01-09-2025 01:51:07 AM
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ‘ప్రతిభా సేతు’
125వ మన్‌కీబాత్‌లో వెల్లడించిన మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 31: పండుగల సీజన్‌లో స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే వాడాలని ప్ర ధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలను కో రారు. ‘వోకల్ ఫర్ లోకల్’ ఒక్కటే దేశప్రజల నినాదంగా ఉండాలన్నారు. ఆదివారం మన్‌కీబాత్ కార్యక్రమం 125వ ఎపిసోడ్ ప్ర సారం అయింది. మోదీ మాట్లాడుతూ.. ‘తృటిలో యూపీఎస్సీలో విఫలం అవుతున్న వారి కోసం ప్రతిభా సేతు పోర్టల్ ఏర్పాటు చేశాం.
ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన విద్యార్థుల వివరాలను ప్రైవేట్ కంపెనీలు కూడా తీసుకుని తమ సంస్థల్లో వారికి ఉపాధి క ల్పించవచ్చు. దేశంలో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు విచారకరం. ప్రకృతి వైపరీత్యా లు దేశాన్ని పరీక్షిస్తున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు జమ్మూకశ్మీర్‌ను అతలాకుతలం చే స్తున్నా.. రాష్ట్రం అనేక విషయాల్లో ముం దుకు వెళ్తోంది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి’ అని పే ర్కొన్నారు. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పుల్వామాలో తొలిసారి డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగిందని, దేశం మా ర్పుకు ఇది సంకేతం అని తెలిపారు.