27 July, 2026 | 12:48 AM

జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

03-09-2025 07:00 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత. వేములవాడ మండలంలోని సాత్రాజుపల్లి, నూకలమర్రి పల్లె దవాఖానల్లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైడే కార్యక్రమం పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

తనిఖీల్లో దోమల లార్వాలు పెరగకుండా నీటి నిల్వలు తొలగించి, ప్రతి వారం డ్రై డే పాటించాల్సిన అవసరాన్ని వైద్య సిబ్బందికి ఆదేశించారు. అలాగే ఇంటి, గ్రామ పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ బాలచంద్రం, సూపర్వైజర్లు గంగం రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.