13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకు సేవలు అందించాలి

26-03-2026 01:48 AM
  1. కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజనసభ 

హనుమకొండ టౌన్, మార్చి 25 (విజయక్రాంతి): వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పనిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, డీసీసీబీపర్సన్ ఇంచార్జ్ ఛాహాత్ బాజ్ పాయ్ అన్నారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు డిపాజిట్ సేకరణ, రుణవితరణలో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ, లాభాల దిశగా ముందుకు సాగుతున్నదని తెలిపారు.

రైతులకు, సహకార సంఘాలకు సమయానికి రుణాలు అందజేసి వ్యవసాయ అభివృద్ధికి బ్యాంకు కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. పాక్స్ యాక్సిలరేటరీ కార్యక్రమం కింద నాబార్డ్ సహకారంతో నాలుగు సహకార సంఘాలకు డ్రోన్లు, జన ఔషధి కేంద్రాల స్థాపనకు తక్కువ వడ్డీపై రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇదే మార్గంలో ఇతర సంఘాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారులు సంజీవరెడ్డి, నీరజ, వాల్య నాయక్, కోదండ రాములు, వరలక్ష్మి, రామ్మోహన్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు, తోటపంటల శాఖ, మత్స్యశాఖ అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి వజీర్ సుల్తాన్, ప్రధాన మేనేజర్ ఉషశ్రీ, ఉప ప్రధాన మేనేజర్ అశోక్, బ్యాంకు ప్రత్యేక విధుల అధికారి విజయ కుమారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.