12-10-2025 06:52:25 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదివేల పోస్టులు మంజూరు చేసి ప్రమోషన్ ద్వారా భర్తీ చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టిజియుయస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్ లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెట్ పల్లి పట్టణంలో ఆదివారం వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలు విద్యారంగానికి పునాది వంటివి, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక పిఎస్ హెచ్ఎం పోస్టును మంజూరు చేయాలని అన్నారు. అలాగే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని కోరారు.
జీ.ఓ 317 వలన వేరే జిల్లాలకు బదిలీ అయి ఇబ్బందులకు గురి అవుతున్న స్పౌజ్ ఉపాధ్యాయుల బాధలను అర్థం చేసుకొని ఉపాధ్యాయ బదిలీలు ప్రభుత్వం నిర్వహించడం జరిగింది, కానీ ఇంకా కొద్దిమంది స్పౌజ్ ఉపాధ్యాయులు ఉన్నారు, మిగిలిపోయిన స్పౌజ్ ఉపాధ్యాయులకు కూడా బదిలీలు నిర్వహించి, వారికి న్యాయం చేయాలని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకాలపు వేతనాలు వెంటనే చెల్లీస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని అన్నారు. టెట్ పై మినహాయింపు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, అలాగే ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెలిస్తూ నూతన పిఆర్సిని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.