12-10-2025 06:45:09 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని బీంపూర్ నుండి సోమిని వరకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించారు. కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు అంతా బురదమయంగా మారడంతో వాహనాలు సైతం గిరిజన గ్రామాల నుండి మండల కేంద్రానికి వెళ్లలేని పరిస్థితిగా మారిందని ప్రజలు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి మండలంలోని నాయకులతో కలిసి గుంతలు ఏర్పడ్డ ప్రదేశంలో మొరం పోసి గుంతలను పూడ్చివేశారు. కల్వర్టు వద్ద గుంతలు ఏర్పడడంతో కంకర సిమెంట్ వేసి కల్వర్టును బాగు చేయాలని కార్యకర్తలకు తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని వారన్నారు. సొంత డబ్బులతో రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించడంతో గిరిజన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.