calender_icon.png 12 September, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపూజీ పోరాటమే స్ఫూర్తి

22-09-2024 01:29:39 AM

బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి):  తెలంగాణ సాధించటానికి, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన అలుపెరగని పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ తెలిపారు. కొండా లక్ష్మణ్  వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.  తెలంగాణ తొలి, మలి దశ పోరాటంలో వారితో క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం దొరకడంపై హర్షం వ్యక్తం చేశారు. కాసు బ్రహ్మనందరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా ఉండి, ఉద్యమం కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారని, ఆ తర్వాత ఎలాంటి పదవులను ఆశించకుండా వెనుకబడిన వర్గా ల గురించి పోరాడిన మహనీయుడు అని కొనియాడారు.