calender_icon.png 8 November, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ జేఏసీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు

07-11-2025 10:52:17 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన  పిలుపు మేరకు  ఈనెల 6 న జిల్లా కేంద్రంలో బహుజన పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ముందు చేసిన మౌన పోరాట దీక్ష విజయవంతం కావడంతో శుక్రవారం జేఏసీ చైర్మన్ రూపు నార్ రమేష్ ను వివిధ సంఘాల నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన బహుజనబందు అందరిని కలుపుకొని ముందుకు సాగి మౌనపోరాటం విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు.

రానున్న రోజుల్లో రమేష్ నాయకత్వంలో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు చేపట్టాలని 42 శాతం రిజర్వేషన్ ఉద్యమంలో తన వెన్నంటే ఉండి సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ మాచర్ల శ్రీనివాస్ , బీసీ జెఎసి జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు బొట్టుపల్లి ప్రశాంత్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సిరికొండ సాయి కృష్ణ తదితరులు ఉన్నారు.