07-11-2025 10:44:55 PM
తూప్రాన్,(విజయక్రాంతి): బంకించంద్ర ఛటర్జీ రచించి శుక్రవారం రోజుతో 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2025 నవంబర్ 7న ప్రత్యేకంగా రోజుగా జరపాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యా సంస్థలలో “వందే మాత్రం” గేయాన్ని పూర్తిగా పాడవలెనని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇందుకుగాను తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ప్రాంగణంలో “వందే మాత్రం” గేయాన్ని ఆర్డిఓ జయచంద్ర రెడ్డి తో పాటు అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆలపించారు ఇందులో కార్యాలయపు అధికారులు, సిబ్బంది ఉన్నారు.