calender_icon.png 8 November, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేమాతరం సామూహిక గీతాలాపన

07-11-2025 10:49:41 PM

జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

ఇబ్రహీంపట్నం: వందేమాతరం" సామూహిక గీతాలాపన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మహాకవి శ్రీ బంకిమ్‌ చంద్ర ఛటర్జీ “వందే మాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “వందే మాతరం”  గీతాన్ని సామూహిక గానం చేయడం జరిగిందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని (కలెక్టరేట్) సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, శ్రీనివాస్, డీఆర్ఓ సంగీతలతో కలసి ఉదయం 10.00 గంటలకు  “వందే మాతరం” గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు, భారతదేశ చరిత్రలో వందే మాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని అన్నారు.  వందేమాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి, భారతదేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని అన్నారు.

ఈ గీతం మన దేశ ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరు ఈ భావనను మనసులో నిలుపుకోవాలని సూచించారు. అలాగే ప్రతిరోజూ పాఠశాలలో వందేమాతరం గేయాన్ని ఆలపించడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత భావాలు మరింత బలపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు, విద్యార్థులు ఈ గీతం ద్వారా దేశసేవా స్పూర్తిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.  వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు.