calender_icon.png 8 November, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు అవగాహన సదస్సు

07-11-2025 10:54:34 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ  57వ డివిజన్ లో అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ దేవాలయంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు అవగాహన సదస్సును నిర్వాహిచారు. అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న  ఆంజనేయ స్వామి దేవాలయంలో కాలనీవాసుల కోసం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సమ్మయ్య నగర్ పిహెచ్సి డాక్టర్ హైదర్, ఏఎన్ఎం శ్రీదేవి, ఆశా వర్కర్లు విజయలక్ష్మిలు అశోక కాలనీ వాసులకు అవగాహన  కల్పించినారు. అనంతరం అధ్యక్షులు మండల కృష్ణారెడ్డి మట్లాడుతు  కాలనీ లోని ప్రతి సభ్యులు ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ప్రతి ఇంటికి ఏఎన్ఎం వచ్చినచో ఆధార్ కార్డులు జిరాక్స్ కాపీ ఇవ్వాలని, పూర్తి ఆరోగ్య సమస్యలు తెలుపాలని అన్నారు.