calender_icon.png 8 November, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో వందేమాతరం గీతాలాపన

07-11-2025 10:37:02 PM

వందేమాతరం గీతం దేశభక్తికి శాశ్వత ప్రతీక, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వందేమాతరం గీతం రచించబడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులతో కలిసి ముకుమ్మడిగా వందేమాతరం గీతాలాపన చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని వేములవాడ రూరల్ ఎస్సై వెంకట్రాజం  తెలిపారు.

ఈ సందర్భంగా వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉత్సాహభరితంగా ఈ వేడుకలు జరుగుతున్నాయని, బంకీం చంద్ర చటర్జీ 1875 సంవత్సరంలో రచించిన ఈ గీతం స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణ ఇచ్చిందని,"వందేమాతరం"అనే మంత్రం అప్పటి యువతలో దేశభక్తిని రగిలించింది అని, ఈ గీతం భారత జాతీయ ఉద్యమానికి ఆత్మగా నిలిచిందని, ఇది కేవలం ఒక పాట కాదు ఇది దేశ ప్రేమ, త్యాగం, ఐక్యతలకు ప్రతీక అని సీఐ తెలిపారు.