07-11-2025 10:33:31 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి బేడ బుడగ జంగాల కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు వేములవాడ అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ శేషాద్రిని రెడ్డి ప్రత్యేకంగా తయారు చేపించిన గౌనులను పంపిణీ చేయడం జరిగింది.
ఇట్టి గౌనులను ఏఎస్పి శేషాద్రిని రెడ్డి స్వయంగా చిన్నారులకు అందజేశారు. పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు కొత్త దుస్తులు అందించాలనే సదుద్దేశంతో ఈ గౌనులను తానే స్వయంగా తయారు చేయించి పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. వేములవాడ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ఏఎస్పి శేషాద్రిని రెడ్డి సేవా దాతృత్వం పై హర్షం వ్యక్తం చేస్తున్న వేములవాడ పట్టణ ప్రజలు.
ఈ గౌనుల పంపిణీ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సహాయ కార్యక్రమాలు మరికొందరికి ప్రేరణగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంపై బేడ బుడగ జంగాల కాలనీవాసులు, నిరుపేద కుటుంబాలు ప్రత్యేకంగా ఏఎస్పీ శేషాద్రినీ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.