07-11-2025 10:46:52 PM
చిట్యాల,(విజయక్రాంతి): డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన నుండి ప్రజలను కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలోని శివనేనిగూడెం గ్రామ సమీపంలో డంపింగ్ యార్డ్ స్థలం రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కెటాయించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య డిమాండ్ చేశారు.
స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ను కలిసి సిపిఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. శివనేనిగూడెం గ్రామంలోని 355 సర్వే నంబర్ లో మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూమి లో చెత్తను మొత్తం డింపింగ్ చేయడం వల్ల దుర్వాసన రావడమే కాకుండా, దోమలు, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్నీ ఇబ్బందులు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.