07-11-2025 10:58:39 PM
రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అధికారులు ప్రజాసేవకు అంకితం కావాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్,కాంగ్రెస్ నాయకులు జీడి వీరస్వామి అన్నారు.శుక్రవారం జాజిరెడ్డిగూడెం మండల నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన పల్లపు ఝాన్సీని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో ఎంపీడీఓగా ఉద్యోగం సాధించి మండలానికి రావడం సంతోషకరమని,చిన్న వయస్సులో ఉద్యోగం సాధించిన ఝాన్సీ ముందుముందు అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.మండలంలో ఉన్న ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ముందుండి అంకితభావంతో పనిచేయాలని కోరారు.