బాసర ట్రిపుల్ ఐటీ బాగుపడేదెట్లా?
రోజుకో వివాదంలో విశ్వవిద్యాలయం
ప్రొఫెసర్లు విద్యార్థుల మధ్య లోపించిన సమన్వయం
నిలదీస్తే విద్యార్థులపై కక్ష సాధింపు, బలవంతపు టీసీలు
సరస్వతి నిలయమైన బాసరలో ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థులకు పదో తరగతి మెరిట్ ఆధారంగా ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బిటెక్ చదువుల కోసం ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్‌జీయూకే యూటీ (బాసర ట్రిపుల్ ఐటీ) నిర్వహణ రోజుకు వివాదాస్పదమవుతుంది. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక వివాదాల సుడిగుండంలో చిక్కుకుని.. తాజా పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఈ ఆర్‌జీయూకే యూటీ వర్శిటీలో ౯౦౦౦ మంది విద్యార్థులు చదువుతున్నప్ప టికీ ప్రభుత్వ నిర్వహణలోపం, అధికారుల సమన్వయం లోపంతో ఈ వర్శిటీని వివాదాల విశ్వవిద్యాలయంగా మార్చుతున్నారు. తమ పిల్లలను ఉజ్వల భవిష్యత్తు కోసం బాసర ట్రిపుల్ ఐటీలో చదివిస్తే చదువు సంగతి ఏంటో కానీ.. కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్, మార్చి ౫ (విజయక్రాంతి): గత పది సంవత్సరాల నుంచి బాసర ట్రిపుల్ ఐటీలో ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్యతో విద్యార్థులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి న అక్కడ విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ పాలసీలు ప్రొఫెసర్ల కోరుతాసిబ్బంది కొరత బాసర ట్రిపుల్ ఐటీలో వివాదాలకు కారణమవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాం లో 2005లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పా టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ పేద విద్యార్థులకు 10వ తరగతి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించి ఇంటర్ బీటెక్‌తో కూడిన ఆరేళ్ల కోర్సులు చదువుకునేందుకు అవకాశం కల్పించారు.
ఆది నుంచి వివాదాలమయం
తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక బాసర ట్రిపు ల్ ఐటీ ఉన్నప్పటికీ దీని నిర్వహణపై ప్రభు త్వం ఆశిస్తున్న స్థాయిలో దృష్టి పెట్టడం లేద న్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ ట్రిపుల్ ఐటీలో మొత్తం తొమ్మిది వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి చదువులు బోధించేందుకు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తోపాటు తగిన ఫ్యాకల్టీ నియమించాలి. ప్రస్తుతం రెగ్యులర్ విసి లేకపోగా ఇంచార్జ్ విసి సమక్షంలో నిర్వహణ చేస్తున్నారు. కాంట్రాక్టు ఒప్పంద ప్రతిపాదన, అతిథి బోధకులతో విద్యా బోధన చేస్తున్నారు. అయితే అతిథి బోధకులు కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యాబోధ న చేయడం వల్ల విద్యా ప్రమాణాలు ఆశించిన లక్ష్యం చేరుకోవడం లేదు.
చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ భవనాలు తాగునీటి సౌకర్యం విద్యా వైద్యం రక్షణ మానసిక కౌన్సిలింగ్ కేంద్రం, భోజనశాలలు తదితర వాటిని ప్రభుత్వం సమకూర్చాలి. ప్రైవేటు ఏజెన్సీల సహకారంలోని ఎక్కువగా వీటిని నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల ఆరోపణలు చేస్తు న్నారు ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఐటీకి ప్రతి సంవత్సరం కొంత బడ్జెట్ను కేటాయిస్తున్న ఖర్చుల విషయంలో విద్యార్థులకు యాజమాన్యం మధ్య వివాదం ఏర్పడుతుంది. 2023లో ఈ విశ్వవిద్యాలయం కల్తీ ఆహారం తిని 300 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావడంతో విద్యార్థి జేఏసీ పది రోజులు టిఫిన్ భోజనం మానేసి నిరసన తెలిపారు. దీనికి స్పందించిన అప్పటి ప్రభుత్వం గవర్నర్ జోక్యం చేసుకొని ఉన్నత కమిటీని బాసరకు పంపించి సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
మెస్‌లపై ఆరోపణలు రావడంతో వాటిని మార్చి కొత్త మెస్‌లకు ఛాన్స్ ఇస్తామని అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు లేవనెత్తిన లాప్టాప్‌ల పంపిణీ పోలీసు రక్షణ తాగునీటి సౌకర్యం విద్యా వైద్యం ప్రొఫెసర్ల భర్తీ తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన అవి ఇంతవరకు అమలు కావడం లేదని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలి దారిటి ఏబీవీపీ ఎస్‌ఎఫ్‌ఐ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆందోళనలో పాల్గొన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు.
ఈ ఘటన మరువకముందే బాసర ట్రిపుల్ ఐటీ లో ఇటీవలే ఓ విద్యార్థి సంఘం నాయకుని గదిలో బంధించి బలవంతపు లెటర్ రాసుకొని కళాశాల నుంచి ఇంటికి పంపడం వివాదాస్పద మైంది. సోమవారం విద్యార్థులు జేఏసీ ఏర్పడి తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిదారిటి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం ప్రధాన సమస్యలతో పాటు బడ్జెట్ నిధుల కేటాయిం పు ఖర్చు వివరాలు సమస్యల పరిష్కారం ప్రధాన డిమాండ్లతో మరో పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
కేసులు పెట్టి బెదిరింపులు..
బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ల విద్యార్థుల మధ్య సమన్వయం లోపించడంతో మళ్లీ వివాదం నెలకొంది బాసర ట్రిపుల్ ఐటీ లో ఇప్పటివరకు 19 మంది విద్యార్థులు వివిధ కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. దీనికి తోడు బాసర ట్రిపుల్ ఐటీలో మెస్ ఏజెన్సీలు ఆరోపణలు, పలు విద్యార్థులు డ్రగ్స్‌తో పట్టు పడడం, గణే ష్ ఉత్సవాల్లో రెండు వర్గాలుగా చీలిపోయి కొట్లాడుకోవడం, సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య విభేదాలు, లైంగిక వేధింపులు, విద్య బోధనలో నిలదీస్తే విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు, బలవంతపు టీసీలు ఇవ్వడం, హక్కుల కోసం పోరాడిన విద్యార్థులపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు జరుగుతున్నాయి.
విశ్వవిద్యాలయంలో ప్రతినిత్యం విద్యను పొందాల్సిన విద్యార్థులు విద్యా హక్కుల కోసం పోరుబాట పట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వవిద్యాలలో వివాదాలు ఏర్పడినప్పుడు రాష్ట్ర మంత్రులు అధికారులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ యూనివర్సిటీ అధికారులు చర్చ లు జరిపి సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం పై దృష్టి పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 9000 మంది విద్యార్థులు చదువుకుంటున్న విశ్వవిద్యాలయంపై ప్రభు త్వం పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.
బాసర ట్రిపుల్ ఐటిఆత్మహత్యల నివారణకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల దత్తత తీసుకున్న మూడు నెలలకి విరమించుకోగా అప్పటినుండి ఇప్పటివర కు నలుగురు విద్యార్థులు చనిపోయారు. కొందరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేసే ఇష్టం లేక అక్కడ పరిస్థితులను గమనించి తిరిగి హైదరాబాద్, వరంగల్ ఇతర ప్రాంతాలకు తమ పిల్లలను తీసుకెళ్లి బీటెక్ చదివిస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం 30 మంది నుంచి 40 మంది విద్యార్థులు బీటెక్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లవలసి వస్తుందని విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు.
ప్రభుత్వం దృష్టి పెడితేనే..
బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న పరిణామాలు వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాసర ట్రిపుల్ ఐటీకి వైస్ ఛాన్స్‌లర్ నియమించి చట్టం మార్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్య కోసం పోరాటగా ముఖ్యమంత్రి హోదాలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించాలి. ఉన్నత విద్య మండలితో ఓ కమిటీని ఏర్పాటు చేసి బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల మౌలిక సదుపాయాలు.
విద్య బోధన ప్రొఫెసర్ల భర్తీ సిబ్బందిపర్తి రక్షణ చర్యలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. బాసర ట్రిపుల్ ఐటీని ఇప్పటివరకు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు మంత్రి సీతక్క తదితర కీలక నేతలు సందర్శించిన వారు ఇచ్చిన హామీలు వెంటనే నెరవే ర్చేల చర్యలు తీసుకోవాలి. బాసరలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ మానవ హక్కుల కమిషన్‌కు రాష్ట్ర కమిటీ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై బాసర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్‌ను వివరణ కోరెందుకు ఫోన్ చేసిన, మెసేజ్ చేసిన ఆయన స్పందించడం లేదు.




