21 April, 2026 | 1:28 AM

సంగారెడ్డిలో ఘనంగా బసవేశ్వర జయంతి

21-04-2026 12:06 AM

నివాళులు అర్పించిన టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 20 : మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా  టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డిలోని బసవేశ్వర విగ్రహాలకు పూల మాలలు సమర్పించారు.మొదట సంగారెడ్డి పట్టణంలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఉన్న విగ్రహానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు., ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం బైపాస్ రోడ్డులోని బసవేశ్వర విగ్రహానికి ఆమె పూలమాలలు సమర్పించారు.

ఈ సందర్భంగా లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డిని , మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్ ల ను ఘనంగా సన్మానించారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ  కాయకమే కైలాసం అని మహాత్మా బసవేశ్వరుడు  శ్రమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడన్నారు. 

సామాజిక సంస్కరణ కోసం, సామాజిక అసమానతలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన   సంఘ సంస్కర్తగా బసవేశ్వరుడి పాత్రను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, నాయకుడు కూన సంతోష్, కౌన్సిలర్లు వంశీ, సతీష్ రెడ్డి, హరిష్ , లింగాయత్ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.