17 April, 2026 | 5:59 PM

బస్తీమే సవాల్!

02-07-2025 01:19 AM
  1. ట్యాంక్‌బండ్, వరంగల్, కరీంనగర్ ఎక్కడైనా ఓకే..
  2. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చర్చిద్దాం..
  3. రాంచందర్‌రావు నేతృత్వంలో కాషాయ జెండా ఎగురవేస్తాం
  4. బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ‘బీఆర్‌ఎస్ నాయకులకు, కాంగ్రె స్ సీఎంకు సవాల్ విసురుతున్నా.. గత 11 ఏళ్లలో మోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించడా నికి మేము సిద్ధంగా ఉన్నాం..అది సెక్రటేరియట్ అయినా, ప్రెస్‌క్లబ్ అయినా, ట్యాంక్‌బండ్ అయినా, వరంగల్ లేదా కరీంనగర్ అయినా ఎక్కడైనా రండి, చర్చి ద్దాం..’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు.

మంగళవారం బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్‌రావు ప్రమాణస్వీకార కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కొంతమంది బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని.. బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో తెలంగా ణ అభివృద్ధి కోసం సుమారు రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నా రు. అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రె స్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

కేంద్రం ఏం చేసింద ని ప్రతి అడ్డమైనోడు మాట్లాడుతున్నాడని,  తాము ఎవరికీ జవాబుదారీ కాదని తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు పోటీపడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఆ పక్షం, ఈ పక్షం అంటూ బీజేపీపై బీఆర్‌ఎస్, కాంగ్రె స్ నాయకులు విమర్శలు చేస్తున్నారని.. తాము ఎవరితోనూ ఎవరి పక్షం కాదని..ప్రజల పక్షమని అన్నారు.

రాంచందర్ రావు  నాయకత్వంలో ఐక్యతతో పనిచేయాలని..రాష్ర్టంలో కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. బీజేపీలో ఎవరు రాష్ర్ట అధ్య క్షుడవుతారన్నది కార్యకర్తలే నిర్ణయిస్తారని..కానీ ఈ అంశంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం అనవసరమని హితవు పలికారు. రాంచందర్‌రావు బీజేపీ కార్య కర్త, విద్యార్థి పరిషత్‌లో పనిచేశారని తెలిపారు.

వామపక్ష భావజాలం ఉన్నవారు బెదిరించినా తట్టుకుని నిలబడ్డారని..ఉస్మానియా లా కాలే జ్ యూనియన్ అధ్యక్షుడిగా, బీజేవైఎంలో పనిచేస్తూ  పోలీసుల లాఠీ చార్జ్‌లో కాళ్లకు గాయమై నేటికీ ఆ గా యాల బాధ భరిస్తున్నారని అన్నా రు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున కోఆర్డినేటర్‌గా ముందుండి నడిపించారని..ఇప్పుడు పార్టీని నడిపిస్తారంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ట్రోల్ చేస్తే తోలు తీస్తా..

  1. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు బీజేపీ గురించి మాట్లాడే హక్కు లేదు
  2. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో నిర్ణయించేది మేమే.. మీరు కాదు
  3. గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగరేయడమే ధ్యేయం
  4. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ‘నేను పేరుకే అధ్యక్షుడిని.. నేనెప్పటికీ పార్టీ కార్యకర్తను మాత్ర మే.. మీ సేవకుడినే..కార్యకర్తలే ఈ పార్టీకి నిజమైన సారథులు..’ అని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. తాను క్రిమినల్ లాయర్‌నని..ఫేక్ న్యూస్ సూత్రధారులను, ట్రోల్ చేసేవారిని బోనులో నిలబెట్టేందుకూ వెనుకాడబోమన్నారు.     

తాను సౌమ్యుడిని కాదని..ఏబీవీపీలో ఉన్నప్పుడే జైలుకు వెళ్లొచ్చినోడినని ట్రోలర్స్‌ను హెచ్చరించారు. ‘బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ..సిద్ధాంత బలమున్న పార్టీ.. కలిసికట్టుగా గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దాం’ అని పిలుపునిచ్చారు.  మంగళవారం బీజేపీ తెలంగాణ నూతన అధ్య క్షుడిగా ఎన్.రాంచందర్‌రావు ఎంపికయ్యా రు. బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆయన పేరు ను అధికారికంగా ప్రకటించి నియామకపత్రం అందించారు.

పార్టీ రాష్ట్ర మాజీ అధ్య క్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొత్త అధ్యక్షుడికి బీజేపీ జెండాను అందించారు. మంగ ళవారం హైదరాబాద్ మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార సభకు భారీసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ర్ట నాయకులు పెద్దసంఖ్య లో హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు భావోద్వేగంగా ప్రసంగించారు.. ఉమ్మడి ఏపీలో జన సంఫ్‌ు అభ్యర్థి పోటీచేస్తే వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చాయని, అయి నా గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని జనసం ఫ్‌ు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు టపాసులు కాల్చారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో తెలంగాణలో 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ, 3 ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకున్నామని తెలిపారు.

పార్టీ కోసం సైకిల్‌పై రాష్ర్టమంతటా తిరుగుతూ ఎంతో కష్టపడ్డామని అన్నారు. బీజేపీ ఈ స్థాయికి వచ్చిం దంటే..ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు త్యాగాలే కారణమన్నారు. అందరి ఆశీ స్సులతో రాష్ర్ట అధ్యక్షుడిగా ఎన్నికవడం గర్వంగా ఉందన్నారు. నక్సలైట్ల తూటాలకు బలైన బీజేపీ నాయకుల బలిదానాలవల్లే పార్టీ ఈ స్థాయికి ఎదిగిందన్నారు.

బీజేపీలో కొత్త, పాత అనే పంచాయితీ లేదని..నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందేనన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వాట్సాప్ వర్సిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్‌ను ట్రోలింగ్ చేస్తున్నాయన్నారు. దమ్ముంటే... నేరుగా ఎదురుగా పోరాడదాం రండి అని సవాల్ విసిరారు.  

పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు: కేంద్రమంత్రి బండి సంజయ్

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడిగా, బీజేపీలో కిందిస్థాయి నుంచి అనేక బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు రాంచందర్‌రావు అని..కష్టపడి కమిట్‌మెంట్‌తో పనిచేసే నాయకుడని, ఆయన సాదాసీదా నాయకుడు కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ కొనియాడారు. సోషల్ మీడియాలో కావాలనే ఆయనపై ట్రోల్ చేస్తున్నా రని.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనపై ట్రోలింగ్ చేయడం తగదని హిత వు పలికారు.

గతంలో మోదీపైనా చాయ్ వాలా ప్రధాని ఏంటని ట్రోలింగ్ చేశారని తెలిపారు. ట్రోల్ చేసిన వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. రాంచం దర్ రావు మిస్సుల్ లాంటి వ్యక్తి అని కితాబునిచ్చారు. విద్యార్థి దశలోనే కాషాయ జెండా ను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడని...కాషాయ జెండా కోసం త్యాగాలు చేసిన నాయకులు ఎంతమంది ఉన్నారో చెప్పండని ప్రశ్నించారు.

నక్సలైట్లు పోస్టర్లు వేస్తే భయపడి పారిపోతున్న ఆ రోజుల్లో ఎదురొడ్డి పోరాడిన నాయకుడన్నారు. అధ్యక్షుడు కావాలని ఎవరైనా ఆశిం చవచ్చని.. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత తూచ తప్పకుండా పాటిం చాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నో అక్రమాలు చేసిన బీఆర్‌ఎస్ నేతలను జైలుకు పంపడంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం చెందిందని తామే అధికారంలో ఉంటే కేసీఆర్ కుటుంబంలో అందరినీ జైలుకు పంపే వాళ్లమన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వాలు అధిష్ఠానానికి మూటలు మోస్తున్నాయి..

బీజేపీ ఎన్నికల పరిశీలకురాలు, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ అక్రమంగా డబ్బులు పోగుచేసి ఢిల్లీ లోని పార్టీ అధిష్ఠానానికి మూటలు మోస్తున్నాయని రాష్ట్ర బీజేపీ ఎన్నికల పరిశీలకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ సర్కారేనని ఆమె స్పష్టం చేశారు. నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాంచందర్‌రావుకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీలు డా. కే లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నగేశ్, బీజేఎల్పీ నేత ఏలేటి, ఉపనేత పాయ ల్ శంకర్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి, మండలిపక్ష నేత ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, పార్టీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ, పా ర్టీ కోశాధికారి బండారి శాంతికుమా ర్, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పోతుగంటి రాములు పాల్గొన్నారు.