02-07-2025 01:20:01 AM
తెలంగాణ ప్రభుత్వ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్
ఖైరతాబాద్;జూలై 1 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ ఉద్యోగ పెన్షనర్ల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ఉమెన్ పెంచనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ చైర్ పర్సన్ ఉమాదేవి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల పెన్షనర్లు హాజరై మాట్లాడారు.. రిటైర్డ్ పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఈ హెచ్ ఎస్ స్కీమ్ అమలు చేసి ఉచిత టెస్టులు, ట్రీట్మెంట్ తో పాటు మందులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే 2 లక్షలు ఉన్న రియంబర్స్మెంట్ 10 లక్షల పెంచాలని అన్నారు. అలాగే ప్రతినెల తకు వచ్చే పెన్షన్లను సకాలంలో తమ ఖాతాలోకి జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్, చంద్రశేఖర్, సుధాకర్, వెంకట్ రెడ్డి ,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ప్రొఫెసర్ కోదండరాం
పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. త్వరలోనే పెన్షనర్స్‌తో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ను రూపొందించుకుందామని సూచించారు.