13 July, 2026 | 2:07 AM

ముత్తారంలో 52 ఏళ్ల తర్వాత ఒకేచోట కలిసిన 1974 బ్యాచ్ విద్యార్థులు

13-07-2026 12:32 AM
  1. మంథని ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
  2. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న సహచరులు

మంథని, జూలై 12 (విజయ క్రాంతి) మంథని ప్రభుత్వ పాఠశాలలో 1974 బ్యాచ్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ముత్తారం మండల కేంద్రంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. దాదాపు 52 ఏళ్ల తర్వాత ఒకేచోట సమావేశమైన వారు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల రోజుల్లోని మధురానుభూతులు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, సహచరులతో గడిపిన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుని ఆత్మీయంగా ముచ్చటించారు.

ఇలాంటి సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, ప్రతి ఏడాది ఇదే తరహాలో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో పనకంటి చంద్రశేఖర్ దంపతులు, ధనుంజయ్ దంపతులు, రాధాకిషన్ దంపతులు, ప్రకాశరావు దంపతులు, ఐలి లింగమూర్తి, కొమ్ము నర్సయ్య దంపతులు, శ్రీహరి, తాటిపల్లి రాజన్న దంపతులు, దేవేందర్ దంపతులు, గంగా రాధాకిషన్, అశోక్ వరహాల దంపతులు, సూర్యప్రకాశ్, కటిక శంకర్, మధుసూదన్, బోయిన్ రవీందర్, గట్టు సత్యనారాయణ దంపతులు, అశోక్ రావు, రాజేందర్తో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు.