calender_icon.png 1 October, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవ సంబరాలు

01-10-2025 05:15:46 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ డివిజన్ ఎస్ ఆర్ టి లో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బోటిక్ ఎండి ఝాన్సీ రెడ్డి శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో యువత బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి చక్కని నృత్యాలతో సరికొత్త స్టెప్పులతో ఎక్కడ తగ్గేది లేదు అంటూ చెబుతూ బతుకమ్మ పాటలతో ఆడిపడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎస్ఆర్టి వీధిలో మహిళలతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని ఈ వేడుకలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను అందంగా ముస్తాబుచేసి పేర్చి బతుకమ్మలు పాటలతో ఆడిపాడతారని అన్నారు. బతుకమ్మలను అందంగా అలంకరించి తెచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆ దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.