calender_icon.png 1 October, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెసిడెంట్ విజయ్ సింగ్ ఆధ్వర్యంలో సందడిగా సద్దుల బతుకమ్మ వేడుకలు

01-10-2025 05:52:55 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ డివిజన్ రవీందర్ నగర్ కాలనీలో ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాలలో రవీంద్ర నగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ సింగ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి రవీంద్ర నగర్ మహిళా మణులతో కలిసి సందడి చేశారు బతుకమ్మ ఉత్సవ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మతో ఆడి పాడి అందరినీ ఉత్సాహపరిచారు. వచ్చిన ముఖ్యఅతిథికి విజయ్ సింగ్ చాలా వాళ్ళతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు పార్థసారథి, ఆర్ సి కుమార్, సహదేవ్ గౌడ్, మాణిక్ పాటిల్, అనంతరెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయ మాజీ పాలకమండలి సభ్యులు కొలను భూపాల్ రెడ్డి, సనత్ నగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముదిరాజ్, షమీవుల్లా, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.