01-10-2025 05:40:00 PM
బాన్సువాడ (విజయక్రాంతి): దసరా పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న రావణ దహన కాష్ట ఏర్పాట్ల పనులను బుధవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రావణ కాష్ట దహన కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆయన సూచించారు. దహన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.