calender_icon.png 1 October, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మెడిసిటీలో సుఖమయ ప్రసవానికి అత్యాధునిక వైద్యం

01-10-2025 05:18:00 PM

మేడ్చల్ (విజయక్రాంతి): నొప్పి లేకుండా సుఖమయ ప్రసవానికి అత్యాధునిక వైద్య సదుపాయాన్ని ఘనపూర్ లోని మెడిసిటీ హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చింది. లేబర్ అనాల్జీషియా అనే పరికరాన్ని మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణతో కలిసి గైనకాలజీ విభాగం హెచ్ ఓ డి డాక్టర్ కల్పన ప్రారంభించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ గర్భవతులు ప్రసవ సమయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. నొప్పి లేకుండా ప్రసవించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ విధానంలో భాగంగా ఆనస్తిసియా, ప్రసూతి వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్యులు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మహేంద్ర సింగ్ నేగి, డైరెక్టర్ డాక్టర్ గీత, వైద్య విద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.