01-10-2025 05:56:38 PM
ఉప్పల్ (విజయక్రాంతి): మద్యం లోడుతో వెళుతున్న డీసీఎంకు విద్యుత్ వైర్లు అనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో స్ఫూర్తి కళాశాల సమీపంలో మద్యం లోడు అయినా డీసీఎం వాహనానికి విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన డ్రైవర్ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో కొన్ని మద్యం బాటిల్లు దగ్ధమయ్యాయి. సుమారు రెండు లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతోనే వరుస ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే పాక్షికంగా కాలిపోయిన మద్యం బాటిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు.