01-10-2025 05:19:57 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ అన్నోజిగూడ గాయత్రి ఆలయంలో 10వ రోజు అమ్మవారు అపరాజితదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజు నిర్వహించే నవ చండీయాగం నిర్వహించారు. అనంతరం పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందడి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, నాయకులు నల్ల వెళ్ళి శేఖర్ ముదిరాజ్, సత్తి రెడ్డి, మోటుపల్లి శ్రీనివాస్, బద్దం జగన్ మోహన్ రెడ్డి, అబ్బావతి నర్సింహా, రాజేశ్వర్ రెడ్డి, జితేందర్ నాయక్, కె.ఎం. రెడ్డి, యాంజాల భాస్కర్ గౌడ్, ఆలయ ట్రస్ట్ సభ్యులు నాబోతు సిద్ది రాములు గుప్తా, చెన్నమనేని వెంకట రావు, మోహన్ రావు, పానుగంటి నర్సింహారావు, గాలి బిక్షపతి, వేణుగోపాల్ శర్మ, రాంమూర్తి, కార్తీక్ పంతులు కౌశిక్ పంతులు , వినీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.