calender_icon.png 1 October, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏవిసిఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా బతుకమ్మ ఉత్సవ సంబరాలు

01-10-2025 05:43:52 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు ఈ ఏడాది కూడా ఎవిఐసి(ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్) ఆధ్వర్యంలో వైభవంగా యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడ్డాయి. 25 రకాల పువ్వులతో అలంకరించిన 25 ఫీట్ల ఎత్తైన బతుకమ్మ అంబరాన్నంటే ఉత్సవాన్ని అందించింది. ఈ వేడుకకు హైకోర్టు జడ్జి నందా గుప్త , ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ఎమ్మెల్సీ శ్రీనివాస్, పోలీస్ కమాండర్ మురళి కృష్ణ, సిల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు, విశిష్ట గోల్డెన్ డైమండ్స్ చైర్మన్ పలబట్ల ఆనంద్ సహా పలువురు ప్రముఖులు హాజరై విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమం బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా సహకరించిన విశిష్ట గోల్డెన్ డైమండ్స్ చైర్మన్ పలబట్ల ఆనంద్ బాబుకి, అసోసియేట్ స్పాన్సర్‌గా తోడ్పడిన సెల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావుకి, అలాగే వకుల సిల్క్స్, శారద సారీస్- మోతీనగర్, కొండాపూర్, ఆదిత్య బిర్లా ఇంద్రియ, జిగిని శ్రీనివాస్ , విజయ లక్ష్మీ డైమండ్స్- పంజాగుట్ట  అంతేకాక, ఈ వేడుక విజయానికి తోడ్పడిన టీమ్ సభ్యులందరికీ కె. ఎస్. ఆర్. మూర్తి – (ఏ వి ఐ సి ఫౌండర్ & చైర్మన్) డా. సరాఫ్ తులసి గుప్తా – (ఏ వి ఐ సి నేషనల్ సెక్రటరీ) డా. సిద్ధి స్వాతి – (ఏ ఐ వి సి తెలంగాణ సెక్రటరీ) ఇంటర్నేషనల్ హ్యూమన్ రైస్ కమిటీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్ యూత్ ప్రెసిడెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ సెక్రటరీ వాడకట్టు శ్రీకాంత్ గుప్తా కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.