01-10-2025 05:46:46 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలోని శుభానంద దేవి అమ్మవారు బుధవారం తొమ్మిదవ రోజున మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో మహేష్ అన్నదాత గందేసిరి మధుసూదన్, రమాదేవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.