calender_icon.png 1 October, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి రథయాత్ర..

01-10-2025 06:04:27 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాలయం అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, వేణుమాధవ్, చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో కన్నుల పండువగ ఈ వేడుకలు నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా జరిగిన రథయాత్ర శోభయాత్రలో భాగంగా మహిళల కోలాటాలు, ఆడిన ఆటలు పాటలు... భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత వారం రోజులుగా నడుస్తున్న రథయాత్ర వేడుకలు దసరా పండుగతో ముగుస్తాయి. ఈ వేడుకల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.