calender_icon.png 1 October, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

01-10-2025 05:41:40 PM

తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి..

తుంగతుర్తి (విజయక్రాంతి): దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారిని వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్నతో పాటు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీలు  వారిని శాలువాలతో సత్కరించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్, సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్, యువజన నాయకులు పెద్ద బోయిన అజయ్, పసుల అశోక్ యాదవ్, చింతకుంట్ల హరీష్ ,బొంకూరి నాగయ్య, బొంకూరు జలంధర్, మరికంటి అశోక్, సుమన్, యాకన్న, తదితరులు పాల్గొన్నారు.