calender_icon.png 30 September, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బతుకమ్మ సంబురాలు

30-09-2025 01:13:44 AM

సుల్తానాబాద్, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి):తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస తెలంగాణీయు లు అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఇండియా సోషల్ అండ్ కల్చర ల్ సెంటర్ వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘ నం గా జరిగాయి. ఎడారి ప్రాంతమైన అబుదాబిలో పూలు దొరకడం కష్టమైన నేపథ్యం లో, సంఘ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ నుండి వందలాది కిలోల పూలను తెప్పించి నగరాన్ని పూల వనంగా మార్చా రు.

ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ.లోని భా రత రాయబార కార్యాలయం నుండి జార్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి, తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. ఇండియా సోషల్ అం డ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు జయచంద్రన్ నాయర్, ఉపాధ్యక్షుడు షాజీ వి.కె., కర్ణాటక రాష్ట్ర సం ఘం అధ్యక్షుడు ,

సర్వోత్తమ్ శెట్టి, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు విజయ్ మా నె, బీహార్ ఝార్ఖండ్ సంఘ అధ్యక్షుడు ది వాకర్ ప్రసా ద్, ఇండియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంఘ అధ్యక్షుడు వినాయక్ ఆవాటే, సంపంగి, బ్యుటి కా సంస్థల యాజమాన్యం ప్రత్యేక అతిథులు గా పాల్గొని, ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు.

వైభవంగా పూల పండుగ

ముకరంపురా, సెప్టెంబర్29(విజయక్రాంతి); పూల పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎంగిలి పూ ల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు తొమ్మిది రోజులపాటు కన్నుల పండులా ని ర్వహించారు. చివరిరోజు దుర్గాష్టమి రోజున తీరోక్కపూలతో నిలువెత్తు బతుకమ్మలను పేర్చి మహిళలు ఆడి పాడారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో ఊరు వాడ చిన్నా పెద్దా తేడా లేకుండా ఉమ్మడి క రీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళలు సద్దుల సంబురాల్లో పాల్గొని కన్నుల పండువలా నిర్వహించారు.

కరీంనగర్ లో జరిగిన సద్దు ల బతుకమ్మ వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి ,ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూ డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా స త్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ లు కుటుంబ సమేతంగా బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు.మహాశక్తి ఆలయంలో మహిళలు, యువత ఆటపాటలతోసందడిచేశారు.

బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే విజయరమణరావు దంపతులు

పెద్దపెల్లి సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) తీరొక్క పూలతో అలంకరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ అట్టహాసం గా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలిగేడు మండలంలోని వారి స్వగ్రా మమైన శివపల్లి నివాసంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు సతీమణి పావ ని తో కలిసి బతుకమ్మను ఎత్తుకొని వేడుకలను ప్రారంభించారు. అలాగే ఎమ్మెల్యే తనయుడు గోపికృష్ణ రావు పాల్గొన్నారు.