calender_icon.png 30 September, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోకాపేటలో హత్య.. అరుపులు విని డయల్ 100కు ఫోన్

30-09-2025 10:34:06 AM

హైదరాబాద్: మద్యం మత్తులో మాట మాట పెరిగి ఒకరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా(Rangareddy) నార్సింగి పోలీస్ స్టేషన్ పరిదిలోని కోకాపేటలో(Kokapet) దారుణ హత్య జరిగింది. యాదగిరి అనే వ్యక్తిని అఫ్రోజ్, నవాజ్ కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. మద్యం తాగి ముగ్గురూ ఘర్షణ పడినట్లు స్థానికులు తెలిపారు. యాదగిరి అరుపులు విన్న స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేశారు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటనాస్తలికి చేరుకున్న నార్సింగి పోలీసులు(Narsingi Police Station) కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.