calender_icon.png 23 September, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంబురంగా బతుకమ్మ పండుగ

23-09-2025 12:44:04 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తీరొక్క పూలతో తొమ్మిది రో జులపాటు పూజలందుకొనే బతుకమ్మ దీవెనలతో రాష్ట్రంలో సుఖశాంతులు వెల్లివిరి యాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, తెలంగాణ సుభి క్షంగా ఉండేలా గౌరమ్మ తల్లి ఆశీర్వదించాలని కోరారు. 

సోమవారం సాయంత్రం మ హబూబ్ నగర్ నగరం లోని పిల్లల మర్రి లో నిర్వహించిన రెండవ రోజు అటుకుల బ తుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి ఆయన ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకకు హాజరై మహిళలను ఉద్దేశిం చి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం గా పెద్దఎత్తున బతుకమ్మ సంబరాలు  చారిత్రాత్మక ప్రదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరుపుకుంటు న్నామన్నారు.

బతుకమ్మ అంటేనే తెలంగాణ అస్తిత్వం, తెలంగా ణ ఆత్మగౌరవం, ఉద్యమస్పూర్తి, మహిళా శక్తి అని చెప్పారు. బతుకమ్మ మన సంస్కృ తి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని, మహిళలను సంఘటితం చేస్తుందన్నారు. బతుకమ్మ-నవరాత్రుల పూజలు ఫలించి, ప్రజలందరి కోరికలు తీరాలని ఆయన ఆ కాంక్షించారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

అందులో భాగంగా మహి ళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, మ హిళా శక్తి క్యాంటీన్ లు, అంతే కాకుండా సో లార్ పవర్ ప్లాంట్ లను సైతం మహిళలకు అప్పగిస్తున్నామన్నారు. వేలాది గా తరలివచ్చిన అక్కాచెల్లెళ్ళు సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి గారు మాట్లాడుతూ బతుకమ్మ పం డుగ చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆమె అభివర్ణించారు .

అంతకు ముందు మహిళలు తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పా టలతో సందడి చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు న ర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,

డిసిసి ప్రధాన కా ర్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌ న్సిలర్లు ఖాజా పాషా, అంజద్, రాషెద్ ఖాన్, జాజి మొగ్గ నర్సింహులు, నాయకులు అశ్వా క్ , వర్ద రవి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శా ఖ అధికారిణి జరీనా బేగం, డిఆర్డీఓ అదనపు పిడి శారద, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.