23-09-2025 12:44:41 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియెజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) కింద మంజూరైన 246 లబ్ధిదారులకు 86 లక్షలు విలువైన చెక్కులనుఆయన పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగంచేసుకోవాలన్నారు.ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, బి జి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు , ఫన్నాల రాఘవరెడ్డి, మాజీ జెడ్పిటిసిలు మాద యాదగిరి, సుంకరబోయిన నరసింహ , దూదిమెట్ల సత్తయ్య, పెద్ది సుక్కయ్య, కంపసాటి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.