22-09-2025 03:06:28 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా లేని పేద మహిళలకు కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తాసిల్దార్ కార్యాలయంలో ఈ మేరకు బీజేపీ నేతలు తహసిల్దార్ వివేక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డు ఉండి, మహిళా స్వయం సహాయక గ్రూప్ లో ఉన్నవారికే బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం సరైనది కాదని, రేషన్ కార్డు ఉండి పేదలైన అర్హులైన ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేసిందని, అదేవిధంగా ఇప్పుడు కూడా అవలంబించాలని, లేనిపక్షంలో మహిళలు బతుకమ్మ చీరలు పొందలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పొదిలా నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, ప్రధాన కార్యదర్శి బోగోజు నాగేశ్వర చారి, రామడుగు వెంకటాచారి, మంగిశెట్టి నాగయ్య, మల్యాల రాములు, చంద్రకళ, చలగోల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.