calender_icon.png 22 September, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలకీడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

22-09-2025 03:56:38 PM

హైదరాబాద్: సూర్యపేట జిల్లాలోని పాలకీడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ(Deccan Cement Factory) వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. బిహర్ కు చెందిన కార్మికుడు వినోద్(45) ఆదివారం అస్వస్థతకు గురైయ్యాడు. గమనించిన తోటీ కార్మికులు వెంటనే వినోద్ ను సిమెంట్ పరిశ్రమ ఆసుపత్రికి తరలించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే వినోద్ మరణించినట్లు వైద్యులు నిర్థరించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బిహర్ కార్మికులు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. ఉద్రిక్తతను నియంత్రించడానికి ఘటనాస్థలికి వచ్చిన పోలీసులపై  బిహర్ కార్మికులు దాడికి పాల్పడ్డారు.

ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను పరుగెత్తించి కర్రలతో దాడి చేశారు. బిహర్ కార్మికుల దాడిలో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయలయ్యాయి. పోలీసుల వాహనంపై రాళ్లు విసిరి ధ్వంసం చేయగా.. పరిశ్రమ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. 200 మందికి పైగా బిహర్ కార్మికులు ఉండడంతో పోలీస్ సిబ్బంది చేతులేత్తేసింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని.. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కార్మికులు డిమాండ్ చేశారు.