22-09-2025 03:03:35 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఈనెల 27న పురస్కరించుకొని కరీంనగర్ లోని బైపాస్ చౌరస్తా వద్దగల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం చుట్టు రైలింగ్ పూర్తిగా శిలమైనందున కొత్తగా ఏర్పాటు చేయాలని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు వాసాల రమేష్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy), మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈనెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. విగ్రహంకు రంగులు వేసి చుట్టూ రైలింగ్ తో ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో జిల్లా నాయకులు స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్ తదితరులున్నారు.