22-09-2025 02:48:35 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(Kalvakuntla Taraka Rama Rao) ప్రధాని నరేంద్ర మోదీపై ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న మోదీ(Narendra Modi) హెచ్1బీ వీసా గురించి మాట్లాడుతారని ఆశించినట్లు కేటీఆర్ వెల్లడించారు. హెచ్1 బీ వీసా(H-1B visa) గురించి మాట్లాడకుండా.. జీఎస్టీ పండగ అని చెప్పారని విమర్శించారు. జీఎస్టీ తగ్గిస్తున్నాం.. పండగ చేసుకోమ్మని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. నిన్నటివరకు రక్తం తాగి.. ఇప్పుడు పండగ చేసుకో అంటున్నారని మండిపడ్డారు. జీఎస్టీ పేరు మీద 8 ఏళ్లపాటు ప్రజల నుంచి ఎంతో గుంజారని కేటీఆర్ ఆరోపించారు. మోదీ గతంలో చెప్పినట్లు రూ. 15 లక్షల ఇస్తే పండగ చేసుకుంటామని చమత్కరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై $100,000 రుసుము విధించే కొత్త ప్రకటనపై సంతకం చేసిన విషయం తెలిసందే. ట్రంప్ నిర్ణయం వలసేతర కార్మికుల ప్రవేశాన్ని పరిమితం చేస్తుంది.