calender_icon.png 22 September, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల జీవితాల్లో వెలుగుకు కారణం కాళేశ్వరం

22-09-2025 03:00:36 PM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ కల సాకారం అవడం అనేది గొప్ప విజయం.. అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్.. అని తెలిపారు. వేలాదిమంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే, దశ దిశను మార్చే ఫ్యాక్టరీ ఇది అని పేర్కొన్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి సముద్రతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి గాలిలో తేమశాతం ఉంటుంది.. కాబట్టి అక్కడ మాత్రమే పామాయిల్ పండేది.. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పాలమూరు గాని, కాళేశ్వరం గాని, సీతారామ గాని వాటి ఫలితంగా తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారిందని అన్నారు.

చిన్నకోడూరు మండలంలో కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి నెలకు 60,000 ఐటీ ఉద్యోగం వదిలి పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు.. మంచి ఆదాయం ఉంది అని సంతోషం వ్యక్తం చేశాడని తెలిపారు. సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దాం అని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో.. 2018లో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు ఉండదు అని ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్(Indian Institute of Oilseeds Research) వారు చెప్పి వెళ్ళిపోయారు. గాలిలో తేమశాతం తక్కువ ఉంది ఇక్కడ పామాయిల్ సాగు జరగదు అని తేల్చి చెప్పారు. ఆ తర్వాత 2019లో అనంతగిరి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తో పాటు చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకున్నాం.. 2021లో పరిశోధన చేసిన తర్వాత మళ్లీ గాలిలో తేమ శాతం పెరిగిందని.. ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చని ప్రకటించారు.. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు అవుతున్నదని అన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చిందంటే కారణం కాళేశ్వరం.. బోరు బండ్లు మాయమైనాయి అంటే కారణం కాళేశ్వరం.. అని తెలిపారు. వరి వండుతుంది కానీ ఎకరానికి 30,000 కంటే ఎక్కువ మిగలదు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యమాని ఎరువులు దొరకక వరి కష్టమైందని.. కానీ ఆయిల్ ఫామ్ సాగు లాభసాటిగా ప్రతినెల జీతం పడ్డట్టు రైతుకు ఆదాయం వస్తుందని హరీష్ రావు అన్నారు.