22-09-2025 04:19:47 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి గ్రామ స్థాయి నుండి మున్నూరు కాపులను సంఘటితం చేసి ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) అన్నారు. సోమవారం కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గంగుల కమలాకర్ సభ్యత్వం తీసుకొని, సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి రాజకీయాలకతీతంగా సదస్సులు సమావేశాలు నిర్వహించి మున్నూరు కాపులను చైతన్యపరచాలని, మారుమూల గ్రామంలో కూడా మున్నూరు కాపు సంఘాలను ఏర్పాటు చేసి మున్నూరు కాపు కులాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకవెళ్లే దిశగా ముందుకు సాగలన్నారు.
తదుపరి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపుల అందరిని సంఘటిత పరిచి ఒక తాటిపైకి తీసుకువెళ్లేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మున్నూరు కాపులందరు సభ్యత్వ నమోదును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకం అమర్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లం లింగమూర్తి, కార్యదర్శి పూదరి తిరుపతి, సంయుక్త కార్యదర్శి వాసాల హరీష్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, నాయకులు మిడిదొడ్డి నవీన్, మున్నూరుకాపు కుల బాంధవులు పాల్గొన్నారు.