27 March, 2026 | 3:41 AM

సీఎంతో బీసీ సంఘాల నేతల భేటీ

27-03-2026 02:03 AM

బీసీ సబ్ ప్లాన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి 

ఫీజురీయింబర్స్‌మెంట్స్ విడుదల చేయాలి

ముఖ్యమంత్రికి జాజుల శ్రీనివాస్‌గౌడ్ వినతి

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తూ బిల్లు పెట్టి సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని, గత నాలుగు సంవత్సరా లుగా పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గురువా రం అసెంబ్లీలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపి కలిసి నాలుగు బిసీ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా తాము అధికారంలోకి రాగానే మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ చట్టం చేస్తామని, ప్రతి ఆర్థిక సంవత్సరంలో బీసీల సంక్షేమానికి 20వేల కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాలకు గాను లక్ష కోట్లు బీసీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకు తో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టంగా హామీ  ఇచ్చారని ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎం కు గుర్తు చేశారు.

బీసీ కులవృత్తుల ఆధునికరణ కోసం స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలోని 22 లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే ఫీజుల బకాయిలను చెల్లించి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహకరించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ సిఎంను కోరారు.

బీసీలకు సబ్ ప్లాన్ తీసుకువస్తూ అసెంబ్లీ సమావేశాలలోనే చట్టం చేయాలని, బీసీల సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించి, ఖర్చు చేయాలని, ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు అమలు చేయా లని కోరారు. సీఎంను కలిసిన వారిలో మైనిం గ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవతి అనిల్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ బీసీ కుల సంఘాల జేఏ సీ చైర్మన్ కుందారం గణేష్ చారి, ప్రొఫెసర్ బాగయ్య, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, తాటికొండ విక్రంగౌడ్, మరి శేఖర్, డాక్టర్ నీలకంటే శ్వరరావు, మడత వెంకట్‌గౌడ్, వల్లపు శివకుమార్, అనంతోజు బ్రహ్మచారి ఉన్నారు.