ప్రొఫెషనల్ కాలేజీల బంద్ విజయవంతం!
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
విద్యారంగానికి నిధులు కేటాయించాలి
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేశ్
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): గడిచిన రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురు వారం తలపెట్టిన ప్రొఫెషనల్ కాలేజీల బంద్ విజయవంతమైందని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాల ని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో విద్యారంగానికి, స్కాలర్‌షిప్‌లకు అధిక నిధులు కేటాయిం చకుండా అన్యాయం చేసిందన్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకూ విడుదల చేయకపోవడం దారుణమన్నారు. బడ్జెట్‌లో రీయిం బర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ ఊసేలేదని మండిపడ్డారు.
ఈ నిధుల విడుదల కోసం ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కమిషన్ల కోసం నిధులన్నీ మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులకే కేటాయించారని ఆరోపించారు. గత బడ్జెట్‌లో స్కాలర్‌షిప్‌లకు రూ.4,502 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.4,343 కేటాయించారన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో అధ్యా పకులకు కాలేజీ యాజమాన్యాలు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీం నిధు లు కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. బడ్జెట్‌లో విద్యకు 8.22 శాతం నిధులను మాత్రమే కేటాయించారని, ఇది ఏమాత్రం విద్యారంగ అభివృద్ధికి సరిపోదన్నారు.




