23 March, 2026 | 2:48 AM

తల్లి రుణం తీర్చుకునేందుకు బీసీ బుద్ధిజీవులు కదలాలి

23-03-2026 01:11 AM

బీసీ కులవృత్తుల దీర్ఘకవితల సదస్సులో జూలూరు

హైదరాబాద్, మార్చి 22(విజయక్రాంతి): ఇది బీసీల విముక్తి సమయం, ఇది బీసీ యుగం, ఐక్యంగా కదిలితేనే సామాజిక న్యాయం సాధ్యమని బహుజన ఉద్యమకవి, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చెప్పారు. బీసీలలో కదలిక వచ్చిందని, దాన్ని సామూహిక శక్తిగా మార్చేపని బీసీ సాహిత్యకారులు, బీసీ బుద్దిజీవులపైననే ఉందన్నారు. బీసీలకు సామా జిక న్యాయం కోసం బీసీ సాహిత్యకారులు కదలటమంటే అది తల్లి రుణం తీర్చుకోవటం లాంటిదని భావోద్వేగంతో మాట్లాడా రు.

బీసీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రఖ్యా త సాహిత్య విమర్శకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బీసీ కులవత్తుల దీర్ఘకవితలు సదస్సు ప్రారంభ సభకు జూలూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవత్తి సాహిత్యాలు ప్రవాహంగా వస్తున్నాయని అవి ఇప్పు్పడు బీసీ వాదసాహిత్యంగా రూపుదాల్చాలన్నా రు. కులచైతన్యం పెరిగిందని, దాన్ని బీసీ ఉద్యమ చైతన్యంగా చేసే, చారిత్రక పనిని బీసీ కవులు, సాహితీ వేత్తలు తమ భుజస్కందాలపై వేసుకోవాలని పేర్కొన్నారు.

బీసీ భావజాల అస్తిత్త్వాన్ని బీసీ ఉద్యమ జెండాగా ఎగురవేసే పని బీసీ బుద్దిజీవుల చేతుల్లోనే ఉందని వివరించారు. బీసీ సాహిత్యవేత్తల కర్తవ్యం విశ్వమానవ విముక్తి గీతమన్నారు. కలుషిత ఆహారం తిని భావి భారతబిడ్డలు రాలిపోతుంటే బీసీ సాహిత్యకారులు పాలకుల దుర్నీతిని బైట పెట్టాలని జూలూరు గౌరీశంకర్ డిమాండ్ చేశారు.

మొదటి సమావేశానికి డా.సంగిశెట్టిశ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వఅధ్యక్షుడు జూలూరుగౌరీశంకర్, ప్రారంభకులుగా కాళోజీ తొలి అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్, ముఖ్యఅతిథిగా సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభా గం అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాము లు, విశిష్టఅతిథిగా కవి కందుకూరి శ్రీరాములు, ఆత్మీయ అతిథిగా బహుళ మహిళా పక్షపత్రిక సంపాదకురాలు జ్వలిత, కవయిత్రి తిరునగరి దేవికి దేవి పాల్గొన్నారు. 

బీసీ దీర్ఘకవితలపై డా.వెల్దండి, శ్రీధర్, ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఎస్ రఘు, బూర్ల వెంకటేశ్వర్లు, డా.ఎంవీ రమణ, డా.కస్ప నరేందర్, రెండవసదస్సుకుసభాధ్యక్షులుగాకాళోజి అవార్డు గ్రహీత శ్రీరామోజు హర గోపాల్, ముఖ్యఅతిథిగా కవి బెల్లి యాద య్య, విశిష్టఅతిథిగా నాళేశ్వరం శంకరం, వక్తలుగా కంచెర్ల మహేష్, డా.బండారి రాజ్ కుమార్, తూర్పింటి నరేష్ ,డా.జయప్రకాష్, డా. తుండు క్రృష్ణకౌండిన్య దీర్ఘకావ్యాలపై మాట్లాడారు.

ముగింపు సదస్సుకు సభాధ్యక్షులుగా బీసీ సాహిత్యవేదిక కన్వీనర్ వున్న ట్లు సుబ్బయ్య, ముఖ్య అతిథులుగా కవి రచయిత కాళోజీ అవార్డు గ్రహీత డా.సీతారాం, బీసీరచయితల సమాఖ్య అధ్యక్షులు గాజోజినాగభూషణం, ఆత్మీయఅతిథులుగా  మల్లి కార్జున్, డా.భీంపల్లిశ్రీకాంత్ పాల్గొన్నారు.  సభా పరిచయం చిక్కొండ్రరవి, వందన సమర్పణ కవి పేర్లు రాము చేశారు.