తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపిన వీఆర్‌ఏలు
వీఆర్‌ఏల సమస్యలను మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ మల్లన్న
హైదరాబాద్, మార్చి 22(విజయక్రాంతి) : 3,700 మంది వీఆర్‌ఏల కుటుంబాల తరపున రాష్ట్ర వీఆర్‌ఏ నాయకత్వం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్‌ఏల హక్కులు, ఉద్యోగ భద్రత, వారికి రావాల్సిన ఉద్యోగాలు, వారి సమస్యల పరిష్కారం కోసం శాస న మండలిలో మల్లన్న మాట్లాడినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తమ సమస్యలను సభలో ప్రస్తావిం చి, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం పట్ల ఆ యన పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీఆర్‌ఏ రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతూ, ఎమ్మెల్సీ మల్లన్న ఇలాగే తమకు అండగా నిలిచి, వీఆర్‌ఏల హక్కుల కోసం నిరంతరం పోరాడాలన్నారు. మల్లన్నకి పూర్తిమద్దతు ఎల్లప్పుడూ ఉంటుంద న్నారు. వీఆర్‌ఏల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తమ తరుపున పోరా టం కొనసాగించాలని మల్లన్నని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర వీఆర్‌ఏ వారసుల అధ్యక్షుడు బీసం ఆంజనేయులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, వనపర్తి కుమార్, నల్గొండ వెంకటేష్, జనగామరాజు, నిజామాబాద్ గంగమల్లు, భూపాలపల్లి హరీశ్, మెదక్ అనిల్, సిద్దిపేట లక్ష్మణ్, వీఆర్‌ఏ వారసులు పాల్గొన్నారు.




