13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

టూరిజం విలేజ్ నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలి

23-03-2026 01:10 AM

రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క

ములుగు, మార్చి22 (విజయక్రాంతి): టూరిజం విలేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా నాణ్యత ప్రమాణాల విషయంలో నిరంతరం అధికారులు తనిఖీ చేస్తూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.

ములుగు మండలం ఇంచర్ల గట్టమ్మ వద్ద పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రామప్ప ప్రాంత సుస్థిర పర్యాటక సర్క్యూట్ లో భాగంగా నిర్మిస్తున్న టూరిజం విలేజ్ నిర్మాణ పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి నిర్మాణ పనులలో గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.